Take a fresh look at your lifestyle.

ఎస్ఎస్సి మూల్యాంకనం డబ్బులు రాకుంటే బహిష్కరణ ఐక్య ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గత ఏడాది ఎస్ఎస్సి మూల్యాంకన విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల పారితోషికం రేపటివరకు రాణి పక్షంలో రేపటి నుంచి మూల్యంకనాన్ని బహిష్కరించనున్నట్లు ఐక్య ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు నిర్మల్ సెయింట్ థామస్ హైస్కూల్ లో జరుగుతున్న ఎస్ఎస్సి మూల్యాంకన కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో పారితోషికం చెల్లించి నిర్మల్ జిల్లాలో చెల్లించకపోవడం శోచనీయమని సంఘ నాయకులు పేర్కొన్నారు.
అనంతరం ఉప క్యాంపు అధికారి పరమేశ్వర్ కు వినతి పత్రం సమర్పించారు. రేపటిలోగా ఉపాధ్యాయుల ఖాతాల్లో వారి పారితోషికం బదిలీ కానిపక్షంలో రేపు ఉదయం నుంచే స్పాట్ విధులను బహిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దాసరి శంకర్, పెంట అశోక్, టియుటిఎఫ్ అధ్యక్షులు తోడిశెట్టి రవికాంత్, పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు చక్రాల హరిప్రసాద్, ఎస్సీ ఎస్టీ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజేష్ నాయక్, క్రాంతికుమార్, టిఆర్టిఎఫ్ అధ్యక్షులు దర్శనం దేవేందర్, డిటిఎఫ్ అధ్యక్షులు శ్రీకాంత్ చారి, తపస్ అధ్యక్షులు శశిరాజ్ మరియు వివిధ సంఘాల రాష్ట్ర జిల్లా బాధ్యులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.