Take a fresh look at your lifestyle.

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి: సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్‌లో నిరసన

ముద్ర ప్రతినిధి, మెదక్:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని, కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను యదావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం మెదక్ జిల్లా కేంద్రంలో సిఐటీయు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు డిమాండ్ల ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటీయు జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ మాట్లాడుతూ… కార్మిక వర్గం గత 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడులను అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ లేబర్ కోడులు కార్మిక హక్కులకు పెద్ద ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తెచ్చిన లేబర్ కోడులు బడా కార్పొరేట్ సంస్థలకు, యజమానులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. అంబానీ, అదానీలకు లాభాల సౌకర్యం కోసం పేదలకు, రైతులకు నష్టం కలిగించే విద్యుత్ ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. విద్యుత్ బిల్లు అమలు ఐతే పేదలకు ఉచిత విద్యుత్, రైతులకు వ్యవసాయ భూములకు విద్యుత్ ఉచితంగా ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయడం కాకుండా ప్రభుత్వమే విద్యుత్ సంస్థలు నడపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మున్సిపల్ నాయకులు ఏసు, అమృత్, సురేష్, శ్రీకాంత్, ఉషమ్మ, ఎల్లమ్మ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.