Take a fresh look at your lifestyle.

హైడ్రా గ్రీవెన్స్​ … మీ సమస్యలు చెప్పండి

  • ఇక నుంచి నేరుగా ఫిర్యాదులు, సమస్యల పత్రాలు
  • మరో వారంలో హైడ్రా పోలీస్​ స్టేషన్లు
  • కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహా నగరంలో అక్రమార్కుల గుండెల్లో బుల్డోజర్లు పరిగెత్తించిన హైడ్రా.. ఇప్పుడు మరో కీలక నిర్మయం తీసుకుంది. తాము తీసుకున్నదే నిర్ణయం అన్నట్టుగా వ్యవహరించిన హైడ్రా మరో ముందడుగు వేసింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ప్రకటించారు. ఫిర్యాదులకు సంబంధించిన అన్ని ఆధారపత్రాలతో పాటుగా పూర్తి వివరాలు తీసుకుని ఫిర్యాదు చేయాలని రంగనాథ్​ సూచించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాను మొదట్లో చాలా మంది వ్యతిరేకించగా.. ప్రస్తుతం హైడ్రా పని తీరుపై మిశ్రమ స్పందన వస్తోంది. ఇప్పటికీ చాలా మంది నగరవాసులు హైడ్రాను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. మరికొందరు మాత్రం హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ క్రమంలో హైడ్రా కొన్ని మార్పులు చేసింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం (జనవరి 6వ తేదీ) నుంచి హైడ్రా ప్రధాన కార్యాలయం బుద్ధ భవన్‌‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. సోమవారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్న 2:00 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ స్వీకరించనున్నారు. ఇకపై ఈ హైడ్రా గ్రీవెన్స్‌ను ప్రతి సోమవారం నిర్వహించనున్నారు. హైడ్రా గ్రీవెన్స్‌కు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించేందుకు అన్ని శాఖల అధికారులు గ్రీవెన్స్‌లో పాల్గొననున్నారు. ఈ గ్రీవెన్స్‌లో ముఖ్యంగా నాలాలు, చెరువులు, ఇతర ఆక్రమణలపై న్యాయపరంగా ఇబ్బందులు కాకుండా.. మిగతా ఏ ఫిర్యాదులు వచ్చినా వారం నుంచి 10 రోజుల్లోపు పరిష్కరించే విధంగా హైడ్రా ఓ ప్రణాళికను రూపొందించింది.

మరోవైపు, వారం రోజుల్లోనే హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు చెప్తున్నారు. సంక్రాంతి పండగ నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రా పోలీస్‌స్టేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపై హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి నుంచి హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారా సేవలు అందించనున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి, ఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఐలు, ఎస్‌ఐలు కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు. చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలు, కుంటల కబ్జాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా తక్షణమే పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 5 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఇందులో అత్యధికంగా నగర శివారు ప్రాంతాలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల నుంచి ఎక్కువగా వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి స్థానిక ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది గ్రీవెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారు హాజరుకానిపక్షంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు.దీనిద్వారా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల ఫిర్యాదులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యాయ వివాదాలు లేకుండా పకడ్బందీగా ఫిర్యాదులను పరిష్కరించాలని హైడ్రా నిర్ణయించింది. ముఖ్యంగా నాలాలు, చెరువులు, ఇతర ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులు ఏవి వచ్చినా సరే న్యాయపరంగా ఇబ్బందులు కాకుంగా వారం నుంచి పది రోజుల్లోపు ఫిర్యాదుదారులు ఇచ్చిన కంప్లైంట్‌లను క్లియర్ చేసే విధంగా హైడ్రా ఓ ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. హైడ్రా ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదువేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నగర శివారుల ప్రాంతాలైన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల నుంచి ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు సంబంధించి స్థానిక ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది గ్రీవెన్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారు హాజరుకానిపక్షంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇవ్వనున్నారు.

మరోవైపు ఆక్రమణలపై హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోతోంది. ఇటీవల కాలంలో ఖాజాగూడ, మల్కాజ్‌గిరిలో ఆక్రమణలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా వద్దకు వస్తే తప్పకుండా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఫిర్యాదుదారుడు అనుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈ ఫిర్యాదులతో పాటుగా ఏమైనా సందేహాలుంటే 040 – 29565758, 29560596 నంబ‌ర్లలో సంప్రదించాల‌ని కమిషర్​ రంగనాథ్​ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.