Take a fresh look at your lifestyle.

చెరువులను కాపాడండి

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
మహబూబ్ నగర్ పట్టణంలోని ఏనుగొండ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోదుగుంట చెరువు భూములపై భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయనీ జాతీయ బిసి మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్, ఉమ్మడి పురుషోత్తం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ లు సోమవారం జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం సమర్పించారు. చెరువు శిఖం, ఎఫ్ఎఎల్ పరిధిలోని భూములను రియాల్టర్లు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు.చెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 294, 292, 296, 298 ఎఫ్ టీఎల్ పరిధిలో ఉండాల్సి ఉందని,
గతంలో పంచాయతీరాజ్ శాఖ నుంచి నీటిపారుదల శాఖకు బదిలీ సమయంలో రికార్డులు తారుమారయ్యాయని కలెక్టర్ కు తెలిపారు.ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు పట్టాదారులు కోర్టులను ఆశ్రయించి తమకు అనుకూలంగా తీర్పులు పొందినట్లు తెలుస్తోందనీ, ప్రస్తుతం చెరువు విస్తీర్ణం కేవలం ఐదు ఎకరాలకే పరిమితమైందని పేర్కొంటూ మిగిలిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చెరువు మధ్యలో రహదారి కోసం మట్టి నింపడంతో అది రెండు భాగాలుగా విడిపోయిందని అలాగే, చెరువు శిఖం ప్రాంతంలోనే గతంలో జేజేఆర్ గార్డెన్ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారని, ప్రస్తుతం అందులోనే షాపింగ్ మాల్ నిర్మిస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిఖం భూములు, బఫర్ జోన్లో నిర్మాణాలు నిషేధమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ కుష్బూ గుప్తాకు వివరించారు. వెంటనే జరుగుతున్న అక్రమ న నిర్మాణాలను తొలగించాలని ఆయన కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, చెరువు భూములను రక్షించాలని వారు కోరారు.

Leave A Reply

Your email address will not be published.