Take a fresh look at your lifestyle.

రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో దీక్షిత ప్రతిభ 

 

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సవాడ గ్రామానికి చెందిన జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని దీక్షిత రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటింది. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాస రచన పోటీలలో ఆమె ప్రోత్సాహక బహుమతిని అందుకుంది.

ఈ విజయంతో పాఠశాలకి, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన దీక్షితను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెల్లంపల్లి రమేష్  ఉపాధ్యాయ బృందం, సహ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వాస శ్రీదేవి, ఉప సర్పంచ్ తిరుపతయ్య, ఏఏపీసీ చైర్‌పర్సన్ భూలక్ష్మమ్మ మరియు గ్రామస్థులు ఆమెను శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులలో ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లడంలో పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జీహెచ్ఎమ్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.