ముద్ర: ఆత్మకూర్( ఎం) పార్లమెంట్ మాజీ సభ్యులు, కమ్యూనిస్టు నేత ,కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 104వ జయంతిని ఆత్మకూరు మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి వద్దగల ధర్మ బిక్షం విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ధర్మ బిక్షం తెలంగాణ సాయుధ పోరాటంలో పేద ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసి విముక్తి కలిగించారని వారు కొనియాడారు .గీసే వాడిదే చెట్టు అనే నినాదంతో గీత కార్మికుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టి సఫలీకృతులయ్యారని వారు తెలిపారు. గీత కార్మికులకు అనేక హక్కులను సాధించి పెట్టిన ఘనత ధర్మ బిక్షంకే దక్కుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బీసు చందర్ గౌడ్ ,ఘనగాని మల్లేష్ గౌడ్, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి , గుండె గాని ఐలయ్య, నాతి రాజు, రంగా సత్యనారాయణ, లోడి శ్రీను , పొన్నగాని జహంగీర్, బొడిగ వెంకన్న ,పోతగాని మల్లేష్ రంగస్వామి, పంజాల కృష్ణమూర్తి, మాధ సత్తయ్య, చెరుకు శ్రీనివాస్, బబ్బురి శివలింగం, రంగ శ్రీను, చెరుకు విష్ణు, తదితరులు పాల్గొన్నారు.