ముద్ర నడిగూడెం…
నడిగూడెం మండల మహిళా సంఘం అధ్యక్షురాలుగా మండలంలోని
వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కోళ్ల పూడి విజయరాణిని ఎన్నిక చేసినట్లు ఏపీఎం దుర్గా ప్రసాద్ తెలిపారు.శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ శక్తి భవన్ లో నిర్వహించిన సంఘ సమావేశంలో ఎన్నుకున్నారు.అధ్యక్షురాలుగా
విజయరాణి, ఉపాధ్యక్షురాలుగా బండారు సుమతి, కోశాధికారిగా రేఖా లత, కార్యదర్శి గా రెడ్డిబోయిన పద్మ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల బలోపేతం కొరకు కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షురాలికి సిబ్బంది అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీసీ సీనయ్య, కంప్యూటర్ ఆపరేటర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు