Take a fresh look at your lifestyle.

కేసీఆర్‌ను జాతిపిత అంటే ఒప్పుకోను -టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం

కేసీఆర్‌ను జాతిపిత అంటే ఒప్పుకోను టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం సెంటిమెంట్ ను రాజకీయాల కోసం వాడుకోవడం తగదు

ముద్ర, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జాతిపిత అంటే తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోనని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సెంటిమెంట్‌ను రాజకీయాల కోసం వాడుకోవడం ఏంటని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదని గుర్తుచేశారు. వ్యక్తిగత అవసరాల కోసం తెలంగాణ అస్థిత్వాన్ని వాడుకోవడం చాలా పెద్ద తప్పు అన్నారు. జాతిపిత అనే బిరుదు ఎవరికి వారు పెట్టుకోవడం కాదు.. అది ప్రజలు ఇవ్వాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయని చెప్పారు. ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు కొందరు నానాతంటాలు పడుతున్నారన్నారు. అయితే రాజకీయాలు చేసుకునేందుకూ ఓ హద్దు ఉంటుందన్న ఆయన… సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలు దెబ్బతీయవద్దని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.