Take a fresh look at your lifestyle.

కంచి పీఠాధిపతికి స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు

మహదేవపూర్, ముద్ర:
కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి కంచి రామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం రాత్రి కాళేశ్వరం చేరుకున్నారు. స్వామి వారిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవదాయ శాఖ సలహాదారు గోవింద హరి, దేవదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు లు స్వాగతం పలికారు.

గురువారం తెల్లవారుజామున ఉదయం 5:31 గంటలకు స్వామి వారు సరస్వతి నది అంత్య పుష్కరాలను పుణ్య స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.భక్తుల రాకతో కాళేశ్వరం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నది.

Leave A Reply

Your email address will not be published.