Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి వనపర్తి జిల్లా పర్యటనను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్,అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, జడ్పి సిఇఒ యాదయ్య,డిఎస్పీ వేంకటేశ్వర రావు,ఇతర సంబంధిత అధికారులతో కలిసి కే.డి.ఆర్.పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుచున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.బహిరంగ సభకు వచ్చే అతి ప్రముఖులు,రాష్ట్ర స్థాయి అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలకు అవసరమైన వసతులు పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు కలక్టర్ వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.