Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి : జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి: మార్చి, 5 నుండి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మార్చి, 5 నుంచి 25 వరకు నిర్వహించ నున్న ఇంటర్మీడియట్ పరీక్షలు, రాష్ట్రంలో ఎల్.ఆర్.ఎస్ ల పురోగతి పై శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లతో ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ సహా ఏ ఒక్కరూ మొబాయిల్ ఫోన్ లోపలికి తీసుకువెళ్ళడానికి అనుమతి లేదని చెప్పారు.పరీక్ష పత్రాలను పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష కేంద్రాలకు బందోబస్తు మధ్య పంపించి పరీక్ష పూర్తి అయిన తర్వాత జవాబు పెపర్లను అంతే జాగ్రత్తగా హైదారాబాద్ కు పంపించాల్సి ఉంటుందని సూచించారు.ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య పరంగా కనీస మందులు, ఒక మెడికల్ ఆఫీసర్, ఆశా ఏ ఎన్.యం లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా కలక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఈ సారి 12150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారనీ, ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 6457 మంది ఉండగా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 5693 మంది ఉన్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 25 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటికే ఇన్విజిపేటర్లకు శిక్షణ సైతం పూర్తి చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిసి టివి ల ఏర్పాటు, 144 సేక్షన్ అమలు, పరీక్షలు జరుగుచున్నంత సేపు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.పరీక్షా కేంద్రాలను శుభ్రంగా ఉంచటం,తాగు నీటి సౌకర్యం కల్పించాలని, మున్సిపాలిటీ, పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ పై మాట్లాడుతూ జిల్లాలో ఎల్.ఆర్ ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారిని గుర్తించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసు కుంటున్నట్లు తెలిపారు.జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ (ఇన్చార్జి) సంచిత్ గంగ్వార్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జడ్పి సీఈఓ యాదయ్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డిపిఒ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.