Take a fresh look at your lifestyle.

అర్హులకే డబుల్ బెడ్రూంలు ఇవ్వాలి

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : డబుల్ బెడ్రూం అర్హుల జాబితాను పునః పరిశీలించి,అర్హులైన పేదలకు ఇళ్లను అందించాలని పట్టణ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మందమర్రి ఎమ్మార్వో పి.సతీష్ కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. అర్హుల జాబితాపై వచ్చిన 58 అభ్యంతరాలతో పాటు కొత్తగా వచ్చిన 110 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన పేదలకు అందించాలని కోరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రామిడి కుమార్,మాజీ వార్డు కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,రేవెల్లి ఓదెలు,గడ్డం రాజు,యువ నాయకులు లక్ష్మీకాంత్,చంద్రకిరణ్,రాజేందర్,మణి,శివ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.