Take a fresh look at your lifestyle.

కార్మికులతో సి ఎం డి బలరాం డైరెక్టర్ల “ముఖాముఖి”

  • జీవీకే 11వ గని ఓసిపి 5 లో సందర్శించిన సీఎండి.

ముద్ర ప్రతినిధి,గోదావరిఖని: సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం, నూతనంగా పదవి భాద్యతలు చేపట్టిన ఎల్.విసూర్యనారాయణ డైరెక్టర్(ఆపరేషన్స్)కె.వెంకటేశ్వర్లు డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) గురువారం రామగుండం ఏరియా లోని జిడికే 11 ఇంక్లైన్,జిడికే ఓసిపి 5 ఉపరితర గనులలో ఉద్యోగులతో “ముఖా ముఖి” కార్యక్రమం ఆర్జీ 1 జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరు తమకు కేటాయించిన విధులను తప్పని సరిగా ఎనిమిది గంటల సమయంలో పూర్తిగా నిర్వర్తించాలని,భారీ యంత్రాల వినియోగ సమయాన్నిపెంచాలని, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని,అలాగే పనిచేస్తున్న సూపర్వైజర్లు, మైనింగ్ సిబ్బంది,కోల్ కట్టర్, సపోర్ట్ మెన్ & వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ గారు ముఖాముఖీతో మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.జిడికే 11 గనిలో,జిడికే ఓసి-5 ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు చైర్మన్ తో మాట్లాడుతూ వివిధ రకాల యంత్రాలు,విడిభాగాలు బాగా పాతదైనప్పటికీ వీటితోనే పనులు వేల్లదీస్తున్నమని ఇట్టి వాటి స్థానం లో నూతన మేషినరిలను ప్రవేశపెట్టడం వలన పనులు పురోగతిలో కొనసాగుతాయని వాటిని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.చైర్మన్ ఉద్యోగుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి త్వరలోనే నిజ నిర్దారణ చేసి వీటికి సంబంధించిన పనులను త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు.భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకత దిశగా పని చేయాలనీ,తప్పనిసరిగా గని నిర్దేశిత వార్షిక లక్ష్యాలు సాధించడానికి కృషి చేయాలని సూచించారు.తదనతరం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జిఎం ఆఫీస్ ముందు ఉన్న డా.బి.ఆర్ అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల లు వేశారు.ఈ కార్యక్రమంలో జిఎం లలిత్ కుమార్, ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్,రక్షణ జియం కే.హెచ్ యన్ గుప్త, క్వాలిటి జియం డి.బైద్య,ఏజంట్ చిలుక శ్రీనివాస్,ఓసి.5 ఉపరితల గని ప్రాజెక్టు ఆఫీసర్ కే.చంద్ర శేఖర్,ఎసియంవో కిరణ్ రాజ్ కుమార్,డిజీ.ఎం పర్సనల్ కిరణ్ బాబు,అధికారులు డి.వి రావు, అంజనేయ ప్రసాద్, ఆంజనేయులు,వర ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, మేనేజర్లు రమేష్ బాబు,అనిల్ గబాలే,బి.మల్లేష్,గుర్తింపుసంఘం యూనియన్ నాయకులు,స్వామీ, మడ్డి ఎల్లయ్య,అరెల్లి పోషం, సీనియర్ పి.వో హన్మంతరావు సంక్షేమ అధికారులు ఇతర అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.