Take a fresh look at your lifestyle.

సమస్యలకు నిలయం పిల్లికొట్టాల్ డబుల్ బెడ్రూంలు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణంలోని 12వ వార్డు పిల్లికొట్టాల్లోని డబుల్ బెడ్రూమ్స్ కాలనీ సమస్యలకు నిలయంగా మారిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యం. అడివయ్య తెలిపారు. ఈనెల 1 నుండి 24 వరకు స్థానిక సమస్యలపై క్షేత్ర పర్యటనలో భాగంగా సిపిఎం మెదక్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రతినిధి బృందం పిల్లికోట్టల్లోని డబుల్ బెడ్ రూమ్స్ కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకుంది.

అడివయ్య మాట్లాడుతూ… పిల్లికోట్టల్లోని డబుల్ బెడ్ రూమ్స్ కాలనీలో 1060 మంది పేదలు నివాసముంటున్నారని తెలిపారు. 4 ఏండ్ల క్రితం ఇండ్లు కేటాయించినప్పటికి మౌళిక సౌకర్యాలు కల్పించడానికి అధికారులు ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. సమస్యల నడుమ ప్రజలు నివాసం ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేదు. సీసీ రోడ్స్ సౌకర్యం లేనందుకు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇండ్ల మద్యలో గల ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగిపోయినయని, రాత్రి సమయాల్లో చీడపురుగులు ఇండ్లలోకి వస్తున్నాయని తెలిపారు. మంచినీటి కొరత తీవ్రంగా ఉందని అన్నారు. 20 నిముషాలు మాత్రమే మంచినీళ్లు సరఫరా చేస్తున్నారని అన్నారు.
మంచినీటి సౌకర్యం కోసం వేసిన బోర్ చెడిపోయి సంవత్సరం గడిచినా రిపేర్ చేయించలేదని అన్నారు. 56వ బ్లాక్లో మంచినీటి సరఫరా లేదని అన్నారు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ నాసిరకంగా ఉన్నాయని, పెచ్చులు ఉడిపోతున్నాయని తెలిపారు. అనేక ఇండ్లు వర్షానికి స్లాబ్స్ నుండి నీళ్లు కారుతున్నాయని తెలిపారు. 4 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయని వాటి చుట్టూ కంచెలు నిర్మించకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్స్ కాలనిలోని సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్స్ కాలనీలో పార్క్స్ అభివృద్ధి చేయాలని, ప్రత్యేకంగా సామూహిక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు అయినా వారికీ ఇప్పటి వరకు ఎందుకు ఇండ్లు కేటాయించలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్స్ కాలనీ అభివృద్ధి కోసం మునిపాలిటీ నిధుల నుండి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.సమస్యల పరిష్కారం కోసం మార్చి 24 న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ మాట్లాడుతూ…డబుల్ బెడ్ రూమ్స్ కాలనీ అభివృద్ధి పట్ల మున్సిపల్ అధికారులకు చిత్తశుద్ధి లేదన్నారు. రోడ్స్ కనీసం క్లిన్ చేయడం లేదని, రోడ్లపై చెత్త పేరుకుపోతున్న మున్సిపల్ అధికారులు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. వాటర్ ట్యాంక్ వద్ద పిచ్చిమొక్కలు పేరిగిపోయినయని వాటిని ఎందుకు తొలగించడం లేదని అన్నారు. కాలానీలో అనేక మంది అసంఘటిత కార్మికులు నివాసం ఉంటున్నారని అన్నారు. అనేక బ్లాక్స్ నిర్మాణం దశలోనే ఉన్నాయని వాటి నిర్మాణం పూర్తి చేసి పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మెదక్ పట్టణ కమిటీ కన్వీనర్ జె. సంతోష్ కుమార్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అజయ్ కుమార్, సిపిఎం నాయకులు షౌకత్, వెంకట్, యాదగిరి డబుల్ బెడ్ రూమ్స్ కాలనీ వాసులు మహమ్మద్ ఆఫ్జల్,మహబూబ్ ఖాన్, మంగ్లీ,హైదర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.