రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి…. జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.. పలు రైస్ మిల్లుల ఆకస్మిక తనిఖీ…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వా నిబంధనలను కచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని పలు రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మిల్లర్లకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన CMR (Custom Milling Rice) సరఫరాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి సమయానికి బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ ఉన్న సరఫరాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
మిల్లర్లు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జితేందర్ రెడ్డి, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.