ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ నుండి కోట్ పల్లి వెళ్ళే మార్గంలోని నాగసమందర్ వద్ద కోట్ పల్లి వాగుపై నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి 27.50 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ మంజూరు చేశారు. వర్షాకాలంలో ప్రస్తుతం ఉన్నలో లెవల్ బ్రిడ్జిపై పైనుండి నీళ్ళు పారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాహనాల రాకపోకలు ఆగిపోతున్నాయి. పరిస్థితిని గమనించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి శాశ్వత పరిష్కారంగా 27.50 కోట్లతో నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించారు. ఈ నూతన హై లెవల్ బ్రిడ్జి నిర్మాణంతో ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులను మంజూరు చేయించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధారూర్, కోట్ పల్లి మండలాల ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.