.
ముద్ర నడిగూడెం….
నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో సర్వేంద్రియణం నయనం ప్రధానం అనే సూక్తి ప్రకారం ప్రతి ఒక్కరికీ కళ్ళు ముఖ్యమని, కళ్ళు ఉంటే అన్నీ ఉన్నట్లేనని సిరిపురం గ్రామసర్పంచ్ వెంపటి రామారావు తెలిపారు.
మెగా కంటి శస్త్ర చికిత్స శిబిరం ద్వారా 200 మందిని పరీక్షించి 80 మంది కంటికి సంభందించిన ఆపరేషన్ చేయాలని గుర్తించుట జరిగింది.ఈ క్యాంపు నిర్వహించిన స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ వారిని సర్పంచ్ మరియు గ్రామస్తులు అభినందించారు,కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాసాని విమల వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శి రాంపెల్లి సతీష్, మాజీ MPTC కస్తూరి లక్ష్మయ్య, వైస్ సర్పంచ్ కొత్తపల్లి రమేష్ నాయకులు వాటి్కూటీ చలపతి, యుగంధరరెడ్డి, రేలా ఇంద్రారెడ్డి, స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కొండలే రవికుమార్, ఓరుగంటి వెంకటేశ్వర్లు, చీదెల్లాహన్మంతరావు,స్వర్ణభారతి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల ప్రవీణ రాజశేఖర్, ఓరుగంటి కిట్టు పాల్గొన్నారు,