Take a fresh look at your lifestyle.

బల్మూర్ లో పెద్దఎత్తున రైతు భరోసా సంబరాలు

అచ్చంపేట ముద్ర విలేఖరి: బల్మూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్రెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా.. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి, ఇప్పటి వరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మల్ రెడ్డి వెంకట్ రెడ్డి పత్రిక ముఖంగా తెలియజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే, సోనియాగాంధీ గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్గానికి అందరికి ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధిలో ఒకటవ స్థానంలో ఉందని, రైతన్నలకు పెద్దపీటవేసే ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే అని వెంకటరెడ్డి అన్నారు.ఈ కార్యక్రమానికి  బల్మూరు మండల రైతులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షులు& మాజీ ఎంపిటిసి ఖదీర్, డిసిసి ప్రధాన కార్యదర్శులు మోహన్ రెడ్డి, కషన్న యాదవ్, తాజా మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాసులు (మైలారం), ఉపాధ్యక్షులు మాశన్న, ప్రధాన కార్యదర్శి సంపంగి రమేష్, చందు నాయక్, చంద్రమౌళి, బుచ్చన్న, వెంకటయ్య, శ్రీశైలం, యువజన నాయకులు అసెంబ్లీ కార్యదర్శి మందుల సాయి, పుట్ట మల్లేష్, దేవేందర్ గౌడ్, బాలరాజ్, శివరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, SC సెల్, ST సెల్, OBC సెల్, కిసాన్ సెల్ నాయకులు,కార్యకర్తలు , కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.