శారీరక దృఢత్వం క్రమశిక్షణ భక్తులకు భద్రత..
ప్రమాద బాధితురాలిని ఆదుకున్న టీజీఎస్పీఎఫ్ సిబ్బంది..
ముద్ర, యాదగిరిగుట్ట :
టీజీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లాక్రా ఆదేశాల సూచనల మేరకు యాదగిరిగుట్ట ఆలయ భద్రతా ఎస్పీఎఫ్ సిబ్బందికి మంగళవారం ఉదయం10 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహించారు. ఈ పరుగు పోటీ తులసి కాటేజ్ నుండి మల్లాపురం వరకు సాగిన ఈ పరుగులో అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించడం భక్తులకు మెరుగైన భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ కె. శేషగిరి రావు తెలిపారు. గత నెల మార్చి 21న స్వామివారి దర్శనానికి వచ్చిన మేడ్చల్ జిల్లా తిప్పాయిగూడ కు చెందిన అనిత అనే భక్తురాలు దర్శనం అనంతరం కొండకేందికి వెళ్లే సమయంలో ఒకేసారి నాలుగైదు బస్సులు రావడంతో సీట్ల కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అనిత అనే భక్తురాలు కింద పడిపోగా డ్రైవర్అ జాగ్రత్త వల్ల బస్సు టైరు ఆమె కాలు పైనుంచి దూసుకెళ్లింది. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భక్తురాలి దీన స్థితిని చూసి చలించిన ఎస్పీఎఫ్ సిబ్బంది కేవలం విధి నిర్వహణకే పరిమితం కాకుండా సాటి మనిషిని ఆదుకోవడం బాధ్యతగా భావించి ఇన్స్పెక్టర్ కె శేషగిరిరావు ఆదేశాల మేరకు బాధితురాలి కి తక్షణ వైద్యం అత్యవసర ఖర్చుల నిమిత్తం సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ. 22400 ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవి ఏఎస్ఐ లు శ్రీనివాస్ రెడ్డి కనకయ్య రాజయ్య నాగేశ్వరరావు మాణిక్ ప్రభు సిబ్బంది మోహన్ రెడ్డి రాజా గౌడ్ పాండు గోపీనాయక్ నందు నాయక్ కురుమూర్తి రమేష్ వీరేష్ మురళి శ్రీకాంత్ రెడ్డి మహేష్ సిద్ధులు సునీల్ కురుమూర్తి సందీప్ రెడ్డి కృష్ణ శేఖర్ యాదగిరి దుర్గ రమేష్ సత్యసాగర్ సూరి ధర్మేష్ అనిల్ పాల్గొన్నారు.