Take a fresh look at your lifestyle.

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

  • మా అబ్బాయి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఉపాధ్యాయుడు గాజుల వెంకటేష్ విద్యార్థుల తల్లిదండ్రులకు వెల్లడించారు.

అచ్చంపేట, ముద్ర విలేఖరి: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పంట పొలాలకి వెళ్ళి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతున్నరు.పాఠశాల ఉపాధ్యాయుడు గాజుల వెంకటేష్ మరియు ఇతర ఉపాధ్యాయులు కలిసి ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించారు.ప్రభుత్వపాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, ఎఫ్ ఎల్ ఎన్ విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఏఐ ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుందన్నారు.కాబట్టి మీ పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యర్థించారు. ఈరోజు 15 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది.అనంతరం గాజుల వెంకటేష్ సమీప పంట పొలాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడి మా బాబు రాహుల్ ఈ బడిలోనే చదువుతున్నాడని, మీ పిల్లలను కూడా మన బడిలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చందన, సంగీత, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.