Take a fresh look at your lifestyle.

కేసుల విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు కీలకం సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగరాజ్

 

మహాదేవపూర్ ముద్ర: కేసుల విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు కీలకమని, వాటిపై న్యాయవాదులు పూర్తిస్థాయి అవగాహనా కలిగి వున్నప్పుడే కేసుల విచారణ సులువవుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మరియు అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో సమావేశం జరిగింది. అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లో ఫోరెన్సిక్ నివేదికలు, వేలిముద్రల అనాలసిస్, చేతిరాత విశ్లేషణ, సైబర్ ఫోరెన్సిక్స్ అనే అంశాలపై జరిగిన కార్యక్రమంలో జడ్జి ప్రసంగించారు. వారు మాట్లాడుతూ ఎఫ్.ఎస్.ఎల్ నివేదికలు సకాలంలో సేకరించి, వాటిని విశ్లేషించి, సరైన పద్దతిలో కోర్టు ముందు పెట్టినప్పుడు కేసుల పరిష్కారం వీలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి, ప్రొబేలాబ్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మోహన్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్, భూపాలపల్లి ఎస్సై రవళి, సీనియర్ న్యాయవాదులు కూనూరి సురేష్ కుమార్, పి.ఆనంద రావు, మంగళపల్లి రాజ్ కుమార్, కే. చిరంజీవి, సంగేమ్ రవీందర్, జి.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.