

బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి.అని రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకులు ఫోన్ ట్యాపింగ్ తో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీతారలను వదలలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భార్యభర్తలు ఫోన్లలో మాట్లాడుకున్న విషయాలు వినే పాపాత్ములు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసిన గత పాలకులు వారి ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి రూ.వందల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ. 1500 కోట్లు ఎవడబ్బ సొమ్ము అని సీఎం ప్రశ్నించారు. చేసిన పాపాలు ఊర్కే పోవన్న సీఎం… .చేసిన పాపాల ఊబిలో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోతుందని చురకలంటించారు.