ముద్ర ప్రతినిధి, మెదక్:
యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 8న ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజ్ లో మెగా జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో గల ఎంపిడిఓ లు పంచాయత్ సెక్రటరీల ద్వారా గ్రామాలలో చాటింపు చేయించాలని, మెదక్ జిల్లాలో గల గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. satg.telangana.gov.in/prajapalana 3 వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, జెడ్పి సిఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రమేష్ గంగాల, ఉపాధి కల్పన అధికారి రామరాజు, పరిశ్రమల శాఖ అధికారి ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.