Take a fresh look at your lifestyle.

భీమునికుంట చెరువు అలుగును పరిశీలంచిన పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భీముని కుంట చెరువు అలుగును తాజా మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎమ్సీ మరియు జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ గారు మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు భీముని కుంట చెరువు ను పరిశీలించడం జరిగినది అని, చెరువు ను త్వరలోనే సుందర శోభితంగా తీర్చిదిద్దుతామన్నారు. భీముని కుంట చెరువు ఇన్ లెట్ మరియు ఔట్ లెట్ స్ధితిగతులను పరిశీలించారు. అలుగు వద్ద చెత్త, చెదారం పెరుకుపోవడం వలన నీటి ప్రవాహం సాఫీగా సాగక మురుగు నీటి వ్యవస్థ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలుగు వద్ద పెరుకపోయిన చెత్త చెదారం వెంటనే జేసీబీ సహాయంతో అలుగు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులకు లేకుండా చూడాలని, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చైర్మన్ గాంధీ అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.