ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలోని పలు హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోటల్ రంగం కుదేలైంది. పెట్టుబడుల వృథా వల్ల ఎదురయ్యే భయంతో హోటళ్లలో సాంప్రదాయిక పద్ధతిలో వంటలను మొదలు పెట్టారు. సిలిండర్ల ప్రవేశానికి ముందు కట్టెల పొయ్యిపై వండిన నేపథ్యంలో మళ్ళీ హోటళ్లలో కట్టెల పొయ్యిని వాడక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో వంట చెరకు ధరలు హఠాత్తుగా పెంచేశారు.