Take a fresh look at your lifestyle.

తాండూర్ మున్సిపల్ లో 36 వార్డులకు నేడు ఎన్నికలు

117 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టణ ప్రజలు

ముద్ర,తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో 36 వార్డులకు మంగళవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 77 వేల ఇరవై తొమ్మిది మంది ఓటర్లు తమ ఔట్ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 39,525 మంది మహిళలు, 37వేల 49 మంది పురుషులు,ఐదు మంది ఇతరులు, ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో మొత్తం 117 కేంద్రాల్లో 585 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల పోలింగ్ నిమిత్తం నియమించారు. వీరిలో 140 మంది రిటర్నింగ్ అధికారులు 140 మంది ప్రీసైడింగ్ అధికారులు ఉన్నారు. 20 శాతం అదనపు సిబ్బందిని కూడా స్పేర్ లో ఉంచుతున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. తాండూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డులను 9 జోన్లుగా విభజించారు. తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ డిఆర్ఓ మంగీలాల్, తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తాహా సిల్దార్ తారా సింగ్ లు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. కాగా తాండూర్ మున్సిపల్ లో 250 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఎన్నికల బందోబస్తు నిర్వహించనున్నారు. తాండూర్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు ఎన్నికల అధికారులు సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు.ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.