ముద్ర, గద్వాల:
గద్వాల మండలం గోనుపాడు గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని
గ్రామ సర్పంచ్ జి. రాములమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్డే పరుషరాముడు సహకారంతో మజ్జిగను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని తాగునీరు దాహార్తిని తీరుస్తుందని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చాంద్ సాలేహా, ఉప సర్పంచ్ సత్యమ్మ, మండల నాయకులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.