బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలి…
జగిత్యాలలో బిఅర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
బండి భగీరథ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో BRS పార్టీ ఆధ్వర్యం లో TRSY, TRSV నాయకులు కలిసి సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ప్రధాన రహదారిపై ఇరువైపుల వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బిఅర్ఎస్ నాయకులను పోలీసు స్టేషన్ కు తరలించి ధర్నా విరమింప జేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు దావ సురేష్ మాట్లాడుతూ ఫోక్సో కేసు లో 24 గంటల్లోనే అరెస్టు చేయాలి కానీ, మూడు రోజులైనా కూడా ఎందుకు అరెస్టు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హోం మంత్రి శాఖ సీఎం రేవంత్ దగ్గరే పెట్టుకుని కళ్ళు లేని కబోది లాగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. గత కొన్ని రోజుల క్రితం మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య అయినా కూడా ఇప్పటివరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదని అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని అన్నారు. బండి భగీరత్ వెంటనే అరెస్టు చేసి మైనర్ బాలికకు న్యాయం చేయాలని లేకుంటే బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని అన్నారు.
ఈ కార్యక్రమం లో నాయకులు కౌన్సిలర్ లు దేవేందర్ నాయక్, సమల్లా రాజశేఖర్, హరీష్, దుర్గయ్య, శీలం ప్రవీణ్, వెంకటేశ్వర రావు, ఐల్నేని ఆనంద్ రావు, గంగాధర్, అల్లల ఆనంద్ రావు, శ్రీరాముల గంగాధర్, నరేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.