Take a fresh look at your lifestyle.

పంచాయతీ సిబ్బందికి దుస్తుల పంపిణీ చేసి వివాహానికి ఆహ్వానం

ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకురుమ మంగమ్మ శివకుమార్ దంపతుల కుమారుడు యశ్వంత్ వివాహం సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి గురువారం దుస్తులు పంపిణీ చేశారు.ఈ నెల 23వ తేదీన తమ కుమారుడు వివాహాన్ని పురస్కరించుకొని నూతన వధూవరులను ఆశీర్వదించాలని యాచారం మండల పరిధిలోని యాచారం, గున్ గల్, గడ్డమల్లయ్యగూడ, చౌదర్ పల్లి, తమ్మాలోనిగూడా, నల్లవెల్లి, నంది వనపర్తి, మల్కీజ్ గూడ తో పాటు 18 గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు బట్టలు పంపిణి చేసి వారిని వివాహానికి ఆహ్వానించారు.కుమారుడి వివాహానికి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని పరిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి ఆహ్వానించడం ఆనందంగా ఉందని కొత్తకురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.