- జగిత్యాల పోలీసులకు భారత్ సురక్ష సమితి నాయకుల పిర్యాదు.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఆపరేషన్ సిందూర్ పై అవమానించేలా పేస్ బుక్ లో పోస్ట్ చేసిన కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత్ సురక్ష సమితి నాయకులు జగిత్యాల టౌన్ సిఐ వేణుగోపాల్ కు పిర్యాదు చేశారు.ఈ సందర్బంగా బి ఎస్ ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు మాట్లాడుతూ ఈ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పై దేశ ద్రోహి కేసు నమోదు చేయాలన్నారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రొ. సూరేపల్లి సుజాత ఆమె పేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టు ఇండియన్ ఆర్మీ, దేశ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా ఉందనీ, ఆమె తన సామాజిక మాధ్యమంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా? నేవేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు అంటూ ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేయాడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఆ పోస్టుపై దేశ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిపారు.మరో వైపు ఆపరేషన్ సిందూర్ ను ఎగతాళి చేసిన సుజాత ముమ్మాటికి దేశ ద్రోహి అని చెబుతూ ఆపరేషన్ సిందూర్ ను తప్పుబట్టేవిధంగా ఆమె వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఆమె రాష్ట్ర విద్యాకమిషన్ సభ్యు రాలిగా ఉండి సుజాత చేసిన వ్యాఖ్యలపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏ సీ ఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ,సింగం గంగాధర్,అక్కినపెళ్లి కాశీనాధం, చిట్ల గంగాధర్, బోందుకురీ శ్రీనివాస్, కొత్తకొండ బాలన్న, రామచంద్రం, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.