Take a fresh look at your lifestyle.

అయ్యప్ప స్వామి ఆలయ అర్చకునికి ఉత్తమ అర్చక పురస్కారం

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ కుమార్ శాస్త్రికి ఉత్తమ అర్చక పురస్కారం ప్రదానం చేశారు.

ఈ పురస్కారాన్ని శ్రీ మదభినవోధండ విద్యాశంకర భారతి స్వామి ఆదివారం అందజేశారు. తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవార్థి ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అయ్యప్ప దేవాలయాలలో సేవలందిస్తున్న అర్చకుల్లో ఉత్తమ సేవలందించిన వారిని ఎంపిక చేసి సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విజయ్ కుమార్ శాస్త్రి అర్చకత్వంలో చేసిన సేవలను కొనియాడారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి, దైవజ్ఞ శర్మ, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ తదితరులు ఆయన కృషిని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ ప్రాంత అయ్యప్ప గురుస్వాములు, భక్తులు విజయ్ కుమార్ శాస్త్రిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.