Take a fresh look at your lifestyle.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

  • మెదక్ లో మోడల్ హౌస్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: అర్హులైన అబ్దిదారులందరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ అన్నారు. శనివారం ఎంపిడిఓ ఆవరణలో హౌజింగ్ శాఖ నిర్మించిన మోడల్ హౌజ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే ఎన్నో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని గుర్తుచేశారు. గుడిసె లేని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడమే ప్రజా పాలన ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. మెదక్ నియోజకవర్గంలోని పేదలందరికి విడతలవారీగా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామన్నారు. రైతులందరికి ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అందజేశామన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే యాభై వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తానని ఎమ్మెల్యే వివరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కాంగ్రెస్ నేతలు మధుసుదన్, బొజ్జ పవన్, షమీ, కొండ శ్రీను, ఉమర్, అవారి శేఖర్, హౌజింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.