ముద్ర ప్రతినిధి, మహబూబ్నగర్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా జిల్లా మహిళా శిశు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏదిరా గ్రామము నాలుగో వార్డ్ భవనం నందు అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ పక్షం గురించి అవగాహన సదస్సును నిర్వహించారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా ఎదిర గ్రామంలో ఈ సందర్భంగా క్లస్టర్ సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ పాలిచేతల్లులు కిశోర బాలికలు అందరూ అంగన్వాడీ కేంద్రం లో ఇచ్చే పౌష్టికాహారాన్ని విధిగా తీసుకొని తమ ఆరోగ్యాన్ని రక్తహీనతకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా మన ఇండ్లలో దొరికే ఆహార పదార్థాలు పాలు ఆకుకూరలు చిరుధాన్యాలు గుడ్లు పండ్లు సమపాళ్లల్లో తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.అంగన్వాడి కేంద్రంలో ఇచ్చే బాలామృతం పసిపిల్లలకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని పిల్లలు బలంగా తయారవుతారని చెప్పారు.కిషోర్ బాలికలు తమ ఆరోగ్య విషయంలో మార్పులు జరుగుతున్నప్పుడు తల్లులకు తెలియజేయాలని తద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎం ద్వారా ఆరోగ్య సలహాలను పొందవచ్చని వారి శరీర అభివృద్ధి గురించి అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ద్వారా పూర్తిగా సమాచారాన్ని పొందవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం కవిత మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా అనేక రకాలైన రోగాలకు చికిత్స లభిస్తుందని గర్భిణీ స్త్రీలు ఆసుపత్రి కాన్పు చేయించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏదిర నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదమ్మ అంగన్వాడీ టీచర్లు పుష్పలత కమల ఉమాదేవి భారతమ్మ స్వరూప వనమాల ఆశా వర్కర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు