ముద్ర, తెలంగాణ బ్యూరో: వాకర్స్ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన పనులను వినూత్నంగా చేపట్టి పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఆయన కేబీఆర్ పార్కులో చేపట్టిన పనులను పరిశీలించారు.లైసెన్స్ తీసుకున్న పెట్ డాగ్స్ ను మాత్రమే పార్కులోకి తీసుకురావాలని కమీషనర్ ఆదేశించారు. కేబీఆర్ చుట్టూ హెచ్ సిటీ ద్వారా చేపట్టే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కోర్టు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా అంటూ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా, సెన్సిటివ్ జోన్ పరిధిలోనే పనులు చేపట్టినట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు కమీషనర్ కు వివరించారు.కమీషనర్ వెంట అడిషనల్ కమిషనర్ సుభద్ర దేవి, డిసి సమ్మయ్య, ప్రాజెక్టు , ఎస్.ఈ శ్రీ లక్ష్మీ, ఈ ఈ నాయక్ డిప్యూటీ ఈఈ హరీష్, సర్కిల్ ఈఈ విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.