ముద్ర ప్రతినిధి, నిర్మల్:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా వల్లకొండ సత్యనారాయణ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన గతంలో నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. నిబద్ధత కలిగిన నాయకునికి ఈ పదవి దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.