Take a fresh look at your lifestyle.

పదవి విరమణ సన్మానం

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.

ఐ ఎన్ టి యు సి నేతకు ఘనంగా వీడ్కోలు

ఎదు మైలారం ఓడిఎఫ్ కర్మాగారంలో శనివారం పదవి విరమణ పొందిన ఐ ఎన్ టి సి ప్రధాన కార్యదర్శి జోగన్న గారి యాదగిరికి కార్మికులు ఘనంగా వీడ్కోలు పలికారు మధ్యాహ్నం సమయంలో గేటు నుంచి బయటికి రాగానే ఆయనపై పూలు చల్లి అభినందించారు. గత 36 సంవత్సరాలుగా యాదగిరి విధులు నిర్వహించారని అన్నారు.సాధారణ కార్మికునిగా ఉద్యోగంలో చేరి కార్మిక సంఘం నేతగా అనేక పోరాటాలు నిర్వహించారని వక్తలు కొనియాడారు కార్మికుల పక్షాన పని చేయడంతో పాటు యాజమాన్యంతో కూడా స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించినారని వారు అభినందించారు పేద కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం యాదగిరి ఇంతకాలం పనిచేసిన సంగతిని వారు గుర్తు చేసుకున్నారు పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి అత్యంత సహజమని వారన్నారు కార్మికుల పక్షాన యాదగిరి లాగా పోరాడే వ్యక్తిని ఇప్పట్లో చూడలేమని వారు పేర్కొన్నారు యాదగిరి మంజుల దంపతులను ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు అభినందించారు కార్మిక సంఘాల నేతలతో పాటు జోగిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లయ్య, కుందారం రాజయ్య పోతేధర్ మనోహర్, లైన్స్ క్లబ్ కార్యదర్శి అంజయ్య పుర్ర రాములు, దాచేపల్లి రవీందర్,
చవాన్ సురేష్, మిరియాల పీతాంబర్ మసూద్ తదితరులు పాల్గొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో ఓడిఎఫ్ కర్మాగారం ఏర్పాటు అయిందని తనలాంటి వేలాదిమందికి ఉద్యోగం దొరికిందని ఈ సందర్భంగా జోగన్న గారి యాదగిరి గుర్తు చేసుకున్నారు. ఓడిఎఫ్ కర్మాగారం విస్తరణ జరిగితే మరింత మందికి ఉద్యోగం దొరుకుతుందన్నారు. తనకు ఇంతకాలం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.