ముద్ర, యాదగిరిగుట్ట :
పోలీసు నిఘా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శనివారం ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయంలో స్వామివారికి నిత్య పూజల అనంతరం అష్టోత్తర శతఘటభి షేకం నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మంటపంలో 108 కలశాలను వరుస క్రమంలో పేర్చి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశాల లో మంత్రపూరితమైన జలంతో స్వామివారిని అభిషేకించారు. స్వామివారి అనుబంధాలయమైన పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శతఘటభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానఅర్చకులు సురేంద్ర చార్యులు ఉప ప్రధానార్చకులు లక్ష్మణ్ కుమార్ చార్యులు మంగళగిరి నరసింహమూర్తి వేణుగోపాలాచార్యులు కిరణ్ కుమార్ చార్యులు మురళీ కుమార్ చార్యులు భరత్ కుమార్ చార్యులు నరేష్ చార్యులు ప్రసన్న రాఘవాచార్యులు శ్రీనాథ్ చార్యులు భక్తులు పాల్గొన్నారు.
