Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

  • జిల్లా ఎస్పి అశోక్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలిస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో, ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు డిజిపి కార్యాలయం నుంచి వచ్చిన అధునాతన పరికరాలు ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్, ట్రాఫిక్ కోన్స్,రిఫ్లెక్ట్ జాకెట్స్, బ్రీత్ అనలైసర్స్, ఎల్ ఇ డి బటన్స్, బొల్లార్డ్స్, రేడియం టేప్ రోలర్స్, డిజిటల్ వీడియో కెమెరాస్, ఫోల్డెడ్ బారికెట్స్, పరికరాలను జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో వివిద పోలీస్ స్టేషన్ ల అదికారులకు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కాలానుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి, ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎఫెక్టివ్ గా విధులు నిర్వహించడానికి ట్రాఫిక్ పరికరాలు ఎంతగానో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పి లు రఘు చంధర్, రాముల, రంగా రెడ్డి, డిసిఆర్ బి, ఎస్ బి, సిసిఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సి.ఐ లు, ఎస్.ఐ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.