ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు నిప్పులు పోస్తూనే ఉంటాం సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ :
కాంగ్రెస్ తెలంగాణలో ఎంఐఎంతో కాపురం చేసినన్ని రోజులు ఆ పార్టీ, నేతలపై నిప్పులు పోస్తూనే ఉంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడిన ఆయన ‘సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభల్లో తన పేరు, ఇంటి పేరు మార్చి తనను కేసీఆర్ కు దత్తపుత్రుడు అంటూ పిలుస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదన్న ఆయన అంత సరదాగా ఉంటే మీరు రేవంత్ ఖాన్‌గా పేరు మార్చుకోండని సూచించారు. రేవంత్ పేరు మార్చుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మీరు ఎవరు? కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాను ఎవరికీ దత్తపుత్రుడిని కాదన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్‌కు మీకు ఏదైనా ఉంటే.. మీరు మీరు తేల్చుకోండి. మీ విమర్శల మధ్యలోకి నన్ను లాగకండి అని వ్యాఖ్యానించారు.