కరీంనగర్‌లో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు – సీఎం అయ్యే శక్తి కవితక్కకే ఉందని గుంజపడుగు హరిప్రసాద్ వ్యాఖ్యలు
ఈరాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి శక్తి కవితక్కకే ఉంది.
తెలంగాణలో ప్రతిపక్షం పాలక పక్షంతో ఒకటే
వెలుగుమట్ల బాధితులకు న్యాయం ఘనత కవితక్కదే.
తెలంగాణ జాగృతి కరీంనగర్
కరీంనగర్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారి జన్మదినం వేడుకలలో ఘనంగా జరిగినాయి ముందుగా మార్కెట్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కవితక్క గారి పేరు మీద అర్చన కార్యక్రమం చేయడం జరిగింది.

బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు రమేష్ ఆద్వర్యంలో పేదలకు అల్పాహారం వితరణతోపాటు. జిల్లా సీనియర్ నాయకుడు రంగరవేణి లక్ష్మణ్ ఆద్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్ లో బారీ కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అక్కం శివరాణి ఆద్వర్యంలో బిట్ వద్ద గల వృద్దుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమంతో పాటు. జిల్లా సీనియర్ నాయకుడు బసవేణి రాజేందర్ ఆద్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్దుల ఆశ్రమంలో పండ్లు పంపిణీ కార్యక్రమం ఎర్పాటు చేయడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా నాయకులు గుండేటి తిరుపతి ఆద్వర్యంలో స్ఫదంన వృద్దుల అనాథ ఆశ్రమంలో అన్నధనం కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ సామాజిక తెలంగాణ లక్ష్యంగా, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి కొట్లాడుతున్న కవితక్క అక్క గారి జన్మదిన వేడుకలను ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం కవితక్క గారు ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవలు చెయ్యాలని భగవంతుడు వారికి అటువంటి శక్తిని ప్రసాదించాలని కోరారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పాలక వర్గం రెండు ఒకటై పరిపాలన చేస్తున్నాయి అందుకే వెలుగుమట్లలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే విధంగా అలోచనతో ఉన్నాయని చెప్పడానికి వెలుగుమట్ల బాధితుల కోసం వారు ఒక్క మాట కుడా మాట్లాడలేదు కానీ కవితక్క వారితో కలిసి చేసిన ఉద్యమ ఫలితం వారిని ప్రభుత్వం గుర్తించిందని వారు అన్నారు. కవితక్క ఇలాంటి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు ఇందులో జిల్లా జాగృతి నాయకులు చంటి శ్రీనివాస్, గాలిపల్లి రత్నాకర్ చారి, జంగ అపర్ణ, పిన్నింటి సంగీత రెడ్డి, గర్శకుర్తి విద్యాసాగర్, MD సల్మ, పోన్నం శిరిష, అంజలి, పుసాల పవన్, లంక మనోజ్, మహమ్మద్ హుస్సేన్, MD యాకుబ్, రంగరవేణి అకాష్, హుస్నాబాద్ రాజ్ కుమార్, నవ్య, తదితరులు పాల్గొన్నారు.