Take a fresh look at your lifestyle.

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి… జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్.. పలు సమస్యలపై వినతులు స్వీకరణ..

 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ఈ మేరకు సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 123 ఫిర్యాదులు రాగా,vఅర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్ పెల్లి ఆర్డీవోలు జీవాకర్ రెడ్డి, నరసింహారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.