రూ.48 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల పట్టణ అభివృద్ధి తో పాటు పరిశుభ్రతకు అధికారులు ప్రజలు సహకరించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. జగిత్యాల పట్టణ 42వ వార్డు లో రోటరీ పార్క్ పక్కన రూ.48 లక్షలతో నూతనంగా వేసిన బీటీ రోడ్డు ను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ బీటీ రోడ్డు పక్కన టైల్స్ తో చిన్న వర్షపు నీటి డ్రైన్ ను ఏర్పాటు చేస్తామని, తద్వారా బీటీ రోడ్డు పాడవకుండా ఉంటుందన్నారు. పట్టణంలో పన్ను వసూలు, ప్రజలకు తాగు నీటి సరఫరా , పచ్చదనం పరిశుభ్రత, కరెంట్ వృథా లేకుండా,
తడి పొడీ చెత్త వేరుగా ఇచ్చేలా వార్డు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలనన్నారు. ప్రజలు ప్లాస్టిక్, చెత్త రెండు కలిపి ఇవ్వడం వల్ల డంపింగ్ యార్డులు కూడా సరిపోవు అన్నారు. జగిత్యాల పట్టణ భావి తరాలకు ఉపయోగంగా అన్ని పార్టీల కౌన్సిలర్ లను కలుపుకొని సలహాలు, సూచనలు తీసుకొని ముఖ్య
అజెండా రూపొందించాలని అని అన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, tpcc సెక్రటరీ బండ శంకర్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, సీనియర్ నాయకులు కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్ , అడువల లక్ష్మణ్, మన్సూర్, డా.నరహరి, De వరుణ్, ఆనంద్, వార్డు నాయకులు కౌన్సిలర్ లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.