ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలంలో రైతుల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కరం కోసం రూ. 8.30 కోట్ల వ్యయం తో మూడు చెక్ డ్యామ్ లు నిర్మిస్తామని విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.బుధవారం హన్వాడ మండలం లో పర్యటించిన ఎమ్మెల్యే చెక్ డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ నిధులతో ఇబ్రహీంబాద్, మునిమోక్షం, వేపూర్ గ్రామాల్లో చెక్ డ్యాం నిర్మాణం చెప్పడతామని ఈ సందర్బంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఈ చెక్ డ్యాంల ద్వారా సమీప ప్రాంతాల్లో ని రైతులకు సాగునీటి కొరత గణనీయంగా తగ్గి, వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరు అందుబాటులోకి రానుందన్నారు. భూగర్భ జలాలు మెరుగుపడటంతో పాటు పంటల దిగుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హన్వాడ మండల కేంద్రంలోని సనాతన సంగమేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.20 లక్షల ముడా నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సామూహిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ హాల్స్ ఎంతో అవసరమని తెలిపారు. ఈ హాలు నిర్మాణంతో స్థానిక ప్రజలకు వివాహాలు, సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. ప్రాంత అభివృద్ధికి మౌలిక సదుపాయాల విస్తరణ కీలకమని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు సల్లోనిపల్లి నుంచి పలుగు తాండ వరకు రూ.1.66 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు వేముల కృష్ణయ్య యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్ , కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, నాయకులు యాదిరెడ్డి, నవనీత, అచ్చన్న, గంగిరెడ్డి, కోస్గి యాదయ్య, నర్సింహులు, రఘు , షబ్బీర్ హుస్సేన్, లింగం నాయక్, విజయ్ నాయక్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.