శీనూ వైట్ల.. సినిమా అంటే ఇది మోసపోయిన దర్శకుడు ఏడు కోట్ల భూ కుంభకోణం పోలీస్ స్టేషన్‌కు చేరిన కేసు అసలు ఏమైందంటే?
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దర్శకుడు శ్రీను వైట్ల కు సినిమా చూపించారు. కేటుగాళ్ల చూపించిన సినిమాకు దర్శకుడు మోసపోయారు. ఆయనను బురిడీ కొట్టించిన కొందరు కేటుగాళ్లు సుమారు 7 కోట్లకు టోపీ పెట్టారు. దాంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ తెలుగు దర్శకుడు శ్రీను వైట్ల కేటుగాళ్లు చేతిలో మోసపోయారు. ఆయనకు టోపీ పెట్టిన ఇద్దరు డబ్బులు కొట్టేశారు. తాను మోసపోయిన సంగతి గ్రహించిన శ్రీను వైట్ల, పోలీసులను ఆశ్రయించారు. ఆ వివరాల్లోకి వెళితే..
భూ కుంభకోణం కేసు ఏమిటంటే?
భారీ భూ కుంభకోణంలో శ్రీను వైట్ల చిక్కుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు రూ. 7.2 కోట్ల మేర మోసపోయారు. తన మేనకోడలు శ్వేతతో కలిసి 2019లో కొంత భూమి కొనుగోలు చేయాలని శ్రీను వైట్ల నిర్ణయించుకున్నారు. మధ్యవర్తులు జెట్టి గారి సుధాకర్ రెడ్డి, కావలి కృష్ణ ద్వారా కొందరు వ్యక్తులు ఆయన్ను సంప్రదించారు. పథకం ప్రకారం శ్రీను వైట్ల, శ్వేతను నమ్మించి డబ్బులు కాజేశారు. వికారాబాద్ జిల్లా కడ్మూర్‌లో తమకు భూమి ఉందని మాయమాటలు చెప్పడంతో పాటు నకిలీ పత్రాలను సృష్టించి శ్రీను వైట్లకు చూపించారు కేటుగాళ్లు. వాళ్ళ మాటలు నమ్మడంతో పాటు భూమి ఉందని భారీ మొత్తంలో (సుమారు ఏడున్నర కోట్లు) నగదు చెల్లించి సేల్ డీడ్లు రెడీ చేసుకున్నారు.
డబ్బులు తీసుకున్నది ఒకరు…
భూమి మాత్రం వేరొకరిది, భారీ మోసం!
డబ్బులు తీసుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయడం లేదు. పలు దఫాలు వాళ్ళను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దాంతో శ్రీను వైట్ల ఆరా తీయగా… ఆ భూములకు సంబంధించిన విషయాలు విచారించగా… ఆ భూమి నిందితులది కాదని, వేరే వ్యక్తులదని తెలిసింది. కుట్రపూరితంగా తనను మోసం చేశారని గ్రహించిన ఆయన… హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీను వైట్ల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు… ప్రధాన నిందితులు జి. ప్రభాకర్ రెడ్డి, మంచంపల్లి ఆనందంతో పాటు మరో పది మందిపై కేసు నమోదు చేశారు. సినిమాల విషయానికి వస్తే… చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయడానికి శ్రీను వైట్ల రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది (2027) సంక్రాంతికి ఆ సినిమా విడుదల కానుంది.