Take a fresh look at your lifestyle.

సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ -కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో పెద్ద ఆరోగ్య సమస్య సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్‌పివి వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మెదక్ జనరల్ ఆసుపత్రి లో హెచ్‌పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని 15 సంవత్సరాల లోపు బాలికలకు జనరల్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రుల్లో హెచ్‌పివి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. బాలికలందరికీ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఉచితంగా వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తల్లి దండ్రుల సమక్షంలో వేయడం జరుగుతుందన్నారు. క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణం కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.శ్రీరామ్, డా. శివాదయాళ్, డా సునీత తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.