గ్రామ సభ భాహిష్కరణ. -నిధుల కేటాయింపులో పక్షపాతం-గత రెండేళ్లుగా అందని నిధులు సీఎం, స్పీకర్ జిల్లాలో దారుణం తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి రామకృష్ణ
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు రాజకీయ రాభందుల పడగ నీడలో నలిగిపోతున్నాయని, అధికార పార్టీ గల్లీ లీడర్లు చెబితేనే అభివృద్ధికి నిధులు, పథకాలు కేటాయించే స్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగడం విడ్డూరమని మోమిన్ పేట మండలం కోల్ కుందగ్రామ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి కరణం కీర్తి రామకృష్ణ ఆరోపించారు. గురువారం గ్రామంలో గ్రామ సభను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కక్ష సాధింపు రాజకీయాలతోనే భారతదేశం అభివృద్ధి సాధించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధికి కేటాయించే నిధులను పార్టీల పేరు చెప్పుకొని ప్రజా సొమ్మును వక్ర మార్గంగా మింగి భ్రతుకుతున్న కొందరు ధగాకోరుల కారణంగానే పల్లెటూర్లు అభివృద్ధి చెండలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటికి కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్లో అదే పరాయి పాలకులకు ఉన్న బుద్ధి కొనసాగుతున్న కారణంగా ప్రాంతాలు వెనకబాటుకు గురౌతున్నాయాని ఎత్తి పొడిచారు. 70 సంవత్సరాల నుండి పాలించామని గొప్పలు చెప్పుకోవడం ప్రజలకు ఉన్న అవసరాలు గుర్తించని పాలనా విధానం ఎందుకని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల కు న్యాయ భద్ధంగా అందాల్సిన అభివృద్ధిని అందకుండా చేస్తున్న నాయకులను సీఎం రేవంత్ రెడ్డి, సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ లు గుర్తించక పోవడం బాధాకరం అన్నారు. అధికారం ఎవ్వరి సొత్తు కాదని ప్రజా స్వామ్యంలో ఓటర్లు ఇచ్చిన హోదా మాత్రమే అని గుర్తించాలని అదే జనాలు అవేర్నెస్ చెందితే సింహాలము, పులులము హ్యాట్రిక్ అని గొప్పలు చెప్పుకున్న వారు, ఎందరో గృహ నిర్భంధాల్లో బిక్కు – బిక్కు మని రోజులు లెక్కించు కుంటున్నారని గుర్తుచేశారు. ఒక వ్యక్తిని కక్షతో ఎదుగకుండా చేయవచ్చేమో కానీ ఆ వ్యక్తి ఆలోచనలు వ్యవస్థను సమూలంగా మార్చేస్తాయని ప్రతి రాజకీయ నాయకుడు గ్రహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 30% పంచాయతీల పరిస్థితి నిధుల కేటాయింపు నందు వివక్షకు గురివు తున్నాయని, సర్పంచు పదవి ఏ రాజకీయ పార్టీకి గులాం గిరి కాదని, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో కూడా స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన వారు ఉన్నారని, పార్టీ సింబల్స్ పై గెలిచిన వారే అధికార పార్టీల్లో చేరదానికి ప్రధాన కారణం ఇలాంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా నాయకులు, అధికారులు చేసే తప్పిదాలే నని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీ పతనాన్ని మిరే కోరుకుంటున్నట్లు గుర్తించాలని కేకే ఆర్ కే హితవు పలికారు. కోలుకొంద గ్రామ సభను భాహిష్కరిస్తునట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి, సభాపతిలు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో పరిస్థితిఇలా ఉందని సర్పంచ్ కీర్తి రామకృష్ణ తెలంగాణ సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి వివరించారు. గత రెండు విడుతలుగా ఎన్ఆర్ఈజీఎస్ నీధులను గ్రామపంచాయతీ కేటాయించ కుండా మహిళా సర్పంచ్ నన్ను అకారణంగా గత మూడు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శినీ నియమించ కుండా తాము గతంలో తెలంగాణ ప్రభుత్వానికి దీటుగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నందుకు జిర్ణించుకొని లోకల్ లీడర్లు ఈ దుచేర్యలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. ప్రతినెల గడపగడపకు తిరుగుతూ ప్రజా పాలన కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్న , అక్కసుతో అధికార పార్టీ నాయకులు తమపై కక్షగట్టి వేధిస్తున్నారని ఇటీవల గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ (చెక్ నెంబర్ 143203) మార్చి10వ తేదీన రిలీజ్ అయినట్టు సమాచారం వచ్చింది. ఇప్పటివరకు ఆ చెక్కు అందలేదని, ఈ విషయమై మండల పరిషత్, ఎమ్మార్వో కార్యాలయాల్లో సమాచారం ఇచ్చినప్పటికీ ఒకరిపై ఒకరు చెప్పడం తప్ప న్యాయం చేయడం లేదని, జిల్లా ఎస్పీ దృష్టికి, ఈ చెక్కు విషయమై సమాచారం ఇవ్వగా ఇది క్రిమినల్ సమస్య కాదని దాటావేయడం, కనీసం మర్యాద ఇవ్వకుండా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అధికారులు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మహిళా సర్పంచ్ పట్ల అధికారులు అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు తమను తీవ్రంగా కలిచి వేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు చదవడానికి తనకు మనసు ఒప్పు కోవడం లేదని చెప్పుకోడానికి, తప్ప ప్రభుత్వ పథకాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. తమ గ్రామంలో తామిచ్చిన హామీలను 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి సుమారు మూడు నెలలుగా లేరని వెంటనే గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి నియమించాలని, మార్చి 10న మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ వెంటనే అందేలా చూడాలని తెలిపారు. తమను అడు గడుగునా అవమాన పరుస్తూ జవాబుదారీ తనము లేని ప్రభుత్వం సూచించిన ముఖ్యమంత్రి సందేశాన్ని తాను చదవలేక పోతున్నానని గ్రామ సభను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న గత రెండు దపాలుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధులను విడుదల చేయడం పాటు గ్రామానికి తక్షణం గ్రామపంచాయతీ కార్యదర్శి నియమించాలని కోరారు.