Take a fresh look at your lifestyle.

యాసంగి ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో వ్యవసాయ, పౌర సరఫరా, అటవీ, స్త్రీ, శిశ సంక్షేమ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఏప్రిల్ 15 నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని సూచించారు. యాసంగి (రబీ)లో 4,45,466 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని స్వీకరించడానికి లక్ష్యం పెట్టుకున్నామన్నారు.
మెదక్ జిల్లాలో వన మహోత్సవంలో మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు.
ఈ సంవత్సరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాకు 31.7 లక్షల మొక్కలు నాటాలని నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. జూలై మొదటి వారంలో ప్రారంభించే ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నర్సరీలలో ఎక్కడెక్కడ మొక్కలు లభ్యమవుతాయి, ఏఏ మొక్కలు నాటాల్సి ఉంటుంది. 2027 టార్గెట్, 2028 లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిక అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు.
బాల్యవివాహాలు నిషేధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
తక్కువ బరువు, ఎత్తు కలిగిన చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.


తక్కువ బరువు, ఎత్తు ఉన్న పిల్లల్ని గుర్తించి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు పాల్గొన్నారు.
10 పరీక్షల కేంద్రం సందర్శన జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక సదుపాయాలు, పర్యవేక్షణ ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు.
పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు.
వినతులు స్వీకరణ


సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతి మాసింగ్ సూచించారు. ఐడిఓసిలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,
డిఆర్డిఓ శ్రీనివాసరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.