Take a fresh look at your lifestyle.

జీవన్ రెడ్డి ఐరన్ లెగ్, ఏ పార్టీ లో ఉంటే అ పార్టీ సర్వనాశనం….జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కామెంట్స్…

హరీష్ రావు లేకుండానే జగిత్యాల లో సభ దేనికి సంకేతం…
జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు ఒక్క రోజు పండుగే…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జీవన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని, ఆయన ఏ పార్టీ లో ఉంటే అ పార్టీ సర్వనాశనం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించి హాట్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి ది ఐరన్ లెగ్ గా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయని, జీవన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ లో చీలిక వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైందన్నారు. అలాగే జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ కు ఒక్క రోజు పండుగే అని, ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటకు పోయిన కవిత కొత్త పార్టీ పెట్టుకుంటున్నారన్నారు. జీవన్ రెడ్డి చేరిక నచ్చని కొందరు బిఅర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి ఫ్లెక్సీ లు తొలగించారని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి చేరిక సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందని, జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని, జగిత్యాల సభ కు వెళ్లకుండా రహాస్యంగా హరీష్ రావు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. యేడాది తర్వాత బయటకు వచ్చి జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటున్న కేసీఆర్ సభకు వెళ్లకుండా హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారని, పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సభకు సీనియర్ నాయకుడు హరీష్ రావు గైర్హాజరి దేనికి సంకేతం అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి చేరిక పైన హరీష్ రావు అసంత్రుప్తితో ఉన్నారని, ఆయన చేరికను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని అన్నారు. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి కూడా హరీష్ రావు ఇష్టపడటం లేదని, హరీష్ రావు ఇంటికి వెళ్లి బుజ్జిగించి తనతో జగిత్యాలకు తీసుకువచ్చినారని ఎమ్మెల్యే సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ను కలవడానికి జీవన్ రెడ్డి ఫామ్ హౌస్ కు వెళ్లినప్పుడు కూడా కనిపించలేదని, ఆ సమయంలో కేసీఆర్, కేటీఆర్ తోనే జీవన్ రెడ్డి భేటీ అయ్యారన్నారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని హరీష్ రావు కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఝప్తి చేశారని, బీజేపీలో చేరాలన్న ఆలోచన చేయోద్దని, బీఆర్ఎస్ లోనే ఉండి జీవన్ రెడ్డి చేరిక పై మనం పోరాడుదామని హరీష్ రావు కు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొనడం హాట్ టాపిక్గా మారింది. జీవన్ రెడ్డి వల్ల ఎన్టిఆర్, తక్కువ వ్యవధిలో నాదెండ్ల భాస్కర్ లు పదవి కోల్పోయారని, 2009 లో రెండవ సారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్గస్థులు అయ్యారని, జగిత్యాల బిఅర్ఎస్ శ్రేణులు జీవన్ రెడ్డి నీ ఐరన్ లెగ్ గా భావిస్తున్నారని ఆరోపించారు. రెండవ సారి ఎమ్మెల్యే గా గెలిచానని, ఇరిగేషన్ పై పూర్తి అవగాహన ఉంది. మేడిగడ్డ సభలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ అభివ్రుద్ది పనులపై స్పష్టమైన ఆదేశాలు హామీలు ఇస్తారని భావిస్తున్ననని అన్నారు. జగిత్యాల అభివ్రుద్ది ద్యేయంగా ముఖ్యమంత్రి తో కలిసి పనిచేస్తున్నానని, రాష్ట్ర స్తాయి రాజకీయాల్లో నేను ఎప్పుడు కలగజేసుకోలేదని, జీవన్ రెడ్డి పార్టీ వీడడంలో నా జోక్యం ఎప్పుడు లేదని స్పష్టం చేశారు. గతంలో జీవన్ రెడ్డి రేవంత్ కావాలి కేసీఆర్ పోవాలి అన్నారని, ఒక మాసం నుండి రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి అని చూస్తే ఇవి పూర్తిగా ప్యాకేజీ మాటలుగా ఉన్నాయని, ఇలాంటి మాటలు సీనియర్ రాజకీయం అనుభవం ఉండి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో DCC అధ్యక్షులు గాజంగి నందయ్య మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్,TPCC సెక్రటరీ బండ శంకర్, పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, మైనార్టీ అధ్యక్షులు మన్సూర్, AMC ఛైర్మెన్ గడ్డంనారాయణరెడ్డి, సీనియర్ నాయకులు దామోదర్ రావు,గట్టు సతీష్,అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, నక్కల రవీందర్ రెడ్డి, గోలి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు రాజేష్, కత్రోజ్ గిరి, శరత్ రావు, ముకేష్ ఖన్నా, కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.