ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్
రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
మోహరించిన పోలీసులు
ముద్ర, కరీంనగర్ :
కరీంనగర్ పట్టణంలో శనివారం బంద్ కొనసాగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడికి నిరసనగా కరీంనగర్ బంద్‌కు భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. అయితే, బీఆర్‌ఎస్ బంద్‌కు కరీంనగర్ ప్రజలకు సంబంధమేంటని భాజపా ప్రశ్నించింది. బంద్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది. భాజపా, బీఆర్‌ఎస్ దాడులు వారి వ్యక్తిగత వ్యవహారమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పరస్పర భిన్న ప్రకటనల నేపథ్యంలో కరీంనగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల కార్యకర్తలను అరెస్టు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను గృహనిర్బంధం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ శ్రేణులను ఉదయమే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.