శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోవింద క్షేత్రం లో ప్రతినెల నిర్వహించే మాస కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.
వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి బాలరాజు, కమిటీ సభ్యులు లక్ష్మీ నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.